తాజా వార్తలు --------- జయపురంలో అష్టాదశ పీఠ దేవతల ప్రతి మూర్తులు ----------- విజయానికి విశ్వాసానికి ప్రతీక విజయ దశమి ------------- జయపురం దసరా ఉత్సవాలలో అపూర్వ అనుభూతి --------------- ఆర్.టి.సి బస్ స్టాండ్ లో కనుల పండుగగా దసరా ఉత్సవాలు -------------- జయపురంలో అంగ రంగ వైభవంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు ------------- కంచే చేను మేస్తే ? -------------- సౌత్ కో అవినీతి, అక్రమాలపై సి.బి.ఐ విచారణ జరపాలి - దక్షిణ ఓడిశా వికాస్ పరిషత్ డిమాండ్ ---------------- జగబందుకు వేలాదిమంది ప్రజల కన్నీటి వీడ్కోలు - ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్ల్యేల ఘన నివాళులు -------------- ఉమ్మరకోట్ శాసన సభ్యుడు జగబందు మజ్జి దారుణ హత్య -------------- ఒరిస్సా కళాశాలలో విద్యార్ధి యూనియన్ ఎన్నికల సందడి - నామినేషన్ల ప్రక్రియ పూర్తి ---------------- వివాహిత ఆత్మహత్య ------------- పంచవటి పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో దొంగతనం - లక్షల విలువయిన పనిముట్లు చోరి ------------- నిర్లక్ష్యపు నిశీధిలో జయపురం బస్ స్టాండ్ -------------- వైద్యం కొరకు కన్న బిడ్డను అమ్ముకున్న అభాగ్యుడు
డిసంబర్  8 వతేదీ సమక్యసింహగర్జన లో
               ప్రవాసాంధ్రులు పాల్గొనండి  
కర్నాటక సమైక్య  రాష్ట్ర పరిరక్షణ  వేదిక  పిలుపు.   

జయపురమ్. నవంబర్ 28. విశాలాంధ్ర విభజనపై కర్నాటక ప్రవాసాంధ్రులు భగ్గుమన్నారు. ముక్యంగా  సీమంద్ర కాంగ్రేస్ కేంద్ర మంత్రులు పైన, నాయకుల పైన, తెలుగు దేశం నాయకుల పైన కర్నాటక సమైక్య పరిరక్షన వేదిక నాయకులు తీవ్రంగా ద్వజమెత్తారు. ఆమె  చెప్పినట్లు ఆడుతాం ఆమె పలకమన్నట్లు 
పలుకుతాం ,అంటూ నోటికి ప్లాస్టర్లు, కళ్ళకు గంతలు కట్టుకొని కట్టుబానిసలాగా ఎన్నుకొన్నజనాభిప్రాయానికి బిన్నంగా “అమ్మ భజన చేస్తోన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల, పాలక కాంగ్రెస్ , ప్రతిపక్ష టి డి పి నాయకుల వైఖరి ని  ప్రవాసాంధ్ర సమైఖ్య వేదిక బెంగళూరు ,తీవ్రంగా నిరసిస్తోంది.కాంగ్రెస్ అధిస్తాన్నాన్ని దిక్కరిస్తే సి బి ఐ ని అడ్డం పెట్టుకొని తమని ఏదో ఒక కేసులో ఎరుకిస్తుందో నాన్న భయం తోనో . తెలంగాణ ను వ్యతిరేకిస్తే ఇప్పటివరకు హైదరాబాద్ లో దాచుకొన్న ఆస్తులకు అపాయం ఏర్పడుతుండెమో  అన్న భయం తో ,రాష్త్రవిభజన ఆగితే వున్నపదవులు, వచ్చేపదవులు రాకుండా పోతాయేమో నన్న భయం తోనో ,లేక మరియే యితర కారనా లతోనో రాష్ట్ర విభజన ప్రకటన జారిగిపోయాక కళ్ళు నోళ్ళు విప్పి తమ ఉనికిని కాపాడు కొనేందుకు ,సీమంధ్ర ప్రజలపై ప్రేమ వొలక పోస్తూ, రాజీనామాలతో (రాజీ అమ్మతో,నామాలు జనానికి) డ్రామాలు వేస్తున్న కాంగ్రెస్ నాయకుల వైఖరి పై పొరుగు రాష్ట్రంలోవున్నా తెలుగు వారికి ఆవేదన కలిగిస్తోంది. అమ్మ కుటుంబం అవసరాలకోసం రాహుల్ ను ప్రధాని చేసెందుకు  ఘన చరిత్ర కలిగిన తెలుగు జాతిని విడదీసేందుకు పూనుకోవ డాన్ని ప్రవాసాంధ్రులు తీవ్రంగా ఖండిస్తునామని  కర్నాటక  సమైక్య రాష్ర్ట పరిరక్షణ  వేదిక అద్యక్షులు పట్టుబాల భాస్కర్ రెడ్డి, గౌరవ అ ద్యక్షులు విశ్రాంత ఐ  ఎ ఎస్  అధికారి  గంగప్ప  .సాదారణ కార్యదర్శి  వేముల సుధాకర్ గుప్త, ఉపాద్యక్షులు కొండూరి సురేష్ వర్మ లు వివిధ రాష్ర్తా ల లోని తెలుగు  సంస్తలకు రాసిన లేఖలలో వెల్లడించారు. 
కాంగ్రెస్ పన్నిన కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్తాయి లో  నాయకులు లేని ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఎన్ జి ఓ జే ఏ సి చైర్మన్ పి. అశోకబాబు గారికి అభినందలు తెలిపారు. .
వారు  ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మద్దతు కోరేందుకు మాజీ ప్రధాని జేడి ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ హెచ్ డి  దేవెగౌడ జీ నీ   బెంగళూరు లో కలిసి చర్చించారు.ఈ సందర్భంగా  వారికీ మాజీ ప్రధాని గట్టి హామీ ఇచ్చారు.తెలంగాణ బిల్లు పార్లమెంటులో వచ్చినపుడు తాను తప్పకుండ వ్యతేరేకిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యం లో పొరుగు రాష్ట్రాల్లో వున్న తెలుగు వారందరిని ఒకే వేదిక పైకి తెచ్చి డిసెంబర్ 8 వ తేది ఆదివారం బెంగళూరు లో సమైఖ్య సింహ ఘర్జన పేరున సమావేశం నిర్వహించాలని ఏ పి ఎం జి ఓ చైర్మన్ పి .అశోకబాబు ప్రవాసాంధ్ర సమైక్య రాస్త్ర పరిరక్షణ వేదిక కర్ణాటక సబ్యులను  కోరారని . ఈ సమావేశం విజయవంతం అయ్యేందుకు మీ అందరి సహాయ సహకారాలు అందివాల్సిందిగా కోరి ప్రాదిస్తున్నామని వారు తెలిపారు . బెంగళూరు లో జరిగే ఈ  సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు సమైక్య నాయకులు తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ జి ,మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి  తదితరులు పాల్గొననున్నారు .ఇది ప్రవాసాంధ్రుల మొదటి సమావేశం . భారత దేశ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి పొరుగు రాస్త్రాల్లో వున్న  సుమారు 6కోట్ల మంది తెలుగు వారి  సంఘాల ప్రతినిధులు తెలుగు తల్లి ని విడదీయ వద్దని కేంద్రం పై వొత్తిడి తేస్తే విభజన ప్రక్రియ ఆగే ఆవకాశం ఎంతైనా వుందని . కావున ప్రతివారు  సమైక్యాంధ్ర సింహగర్జనలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు.  సమైక్యాంధ్ర సింహ గర్జనలో ప్రతి తెలుగు వాడు పాల్గొనాలి జయపూర్ టై మ్స్  కోరుచున్నది. 

పర్యావరణ రక్షణపైనే అధారపడి ఉంది మన మనుగడ

ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న అధికారులు
జయపురం.జూన్ 6: పర్యావరణంపైనే మన మనుగడ ఆధారపడి ఉందని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ సంస్థలు మంగళవారం పర్యావరణ రక్షణపై ర్యాలీలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత వివరించారు. స్థానిక సోషల్ ఎడుకేషన్, ఎన్విరాన్ మెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ (సీవా) సంస్ఠ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిలో సీవా కార్యకర్తలతో పాటు విద్యార్దులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో ఫారెస్ట్ డివిజన్ అధికారుల సహకారంతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి అజిత్ కుమార్, పర్మినెంట్ లీగల్ ఎయిడ్ కోర్ట్ జడ్జి అభయ్ రంజన్ దాస్ , సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశోక్ కుమార్ పట్నాయక్ , స్పెషల్ విజిలెన్స్ జడ్జి శశికాంత్ మిశ్రా, జిల్లా లీగల్ అదాలత్ సంస్థ కార్యదర్శి నిరంజన్ జెన, డివిజనల్ ఫారెస్ట్ అధికారి నళిని కాంత్ మిశ్రా, జయపురం రేంజర్ అనుప్ కుమార్ బెహరా తదితరులు పాల్గొన్నారు.  
పాఠకులందరికి శ్రీ నందన నామ సంవత్సర - "ఉగాది" శుభాకాంక్షలు 


వి.భాస్కర రావు రెడ్డి 

జయపురంలో అష్టాదశ పీఠ దేవతల ప్రతి మూర్తులు

శివసతి దేవి వియోగం
జయపురం నవ రాత్రుల ఉత్సవాల సందర్భంగా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలు ప్రజలను ఆకట్టుకొంటున్నాయి.


జయపూర్ టైమ్స్ పాఠకులకు 
దసరా శుభాకాంక్షలు 


వి.భాస్కర్ రావు రెడ్డి
Related Posts Plugin for WordPress, Blogger...